వెల్లుల్లి నీటిని ఇలా తాగితే..ఎన్నో లాభాలు..! పొట్ట తగ్గాలంటే తాగాల్సిందే..!

-

ఉల్లి, వెల్లుల్లి ఆరోగ్యానికి మేలు చేసే తల్లి లాంటివి. వీటిని వంటల్లో వాడటం వరకే చాలామందికి తెలుసు.. ఎన్నో సమస్యలకు ఉల్లి, వెల్లుల్లి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. ముఖ్యంగా వెలుల్లిలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. ఉల్లిపాయ జుట్టుకు మంచిదని అందిరికి విదితిమే.. మరి వెలుల్లిలో ఏం లాభాలు ఉన్నాయి.. అందులోనూ వెలుల్లి నీటితో ఏంటి బెనిఫిట్‌ అనేది ఈరోజు చూద్దాం..!

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులను దూరం చేస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ బి1, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఆరోగ్యానికి మేలు చేసే మాంగనీస్, కాల్షియం, ఐరన్ కూడా ఉన్నాయి .

వెల్లుల్లి నీటి వల్ల లాభాలు..

వెల్లుల్లి పొట్టకు చాలా మేలు చేస్తుంది. గార్లిక్ వాటర్ తాగడం వల్ల అనేక ఉదర సమస్యల నుంచి బయటపడొచ్చు.. వెల్లుల్లి కడుపు నొప్పి, గ్యాస్, తిమ్మిరి, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.. ఎప్పుడైనా జీర్ణక్రియకు ఆటంకం కలిగితే.. అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం వెల్లుల్లి నీటిని తాగొచ్చు. వెల్లుల్లి నీళ్లు తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి కూడా రాదు.

వెల్లుల్లికి రక్తాన్ని పలుచగా చేసే గుణం ఉంది. దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గార్లిక్ వాటర్ తాగడం వల్ల రక్తం పల్చగా మారి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఇందులో గుండెకు మేలు చేసే అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుందట.

వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు సమస్య సైతం దరిచేరదు..సమస్య ఉన్నప్పుడు తాగినా వెంటనే నయం అవుతుంది.

వెల్లుల్లి నీరు.. ఎప్పుడు, ఎలా తాగాలి..?

రెండు గ్లాసుల నీటిలో రెండు-మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మరిగించండి… ఇలా చేస్తే వెల్లుల్లిలోని పోషకాలన్నీ నీటిలో కలిసిపోతాయి. రుచి కోసం మిరియాలు, నల్ల ఉప్పు వేయండి.. ఫిల్టర్‌ చేసుకుని తాగేయడమే.. అనేక పోషక విలువలున్న ఈ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మరింత మేలు జరుగుతుంది. ఇంకా అల్పాహారం తర్వాత లేదా భోజనం తర్వాత కూడా తాగవచ్చు. కావాలనుకుంటే.. తేనె, నిమ్మ రసం కూడా కలుపుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news