యూకలిప్టస్ చెట్లు.. వీటినే నీలగిరి చెట్లు అని కూడా అంటారు. యూకలిప్టస్ ఆయిల్ గురించి మనం వినే ఉంటాం..టీవీ యాడ్స్ లో పెయిన్ బామ్స్ లో యూకలిప్టస్ ఆయిల్ కలయిక అంటూ చెప్తుంటారు. అనేక ఔషధగుణాలు ఈ చెట్టులో ఉన్నాయి. ఈ చెట్టు ఆకుల వాసన పీలిస్తేనే మంచి ఉమశమనం ఉంటుంది. నీరు లేకుండా కూడా పెరగగలిగే చెట్టు ఇది. ఈ చెట్టు నుంచే యూకలిప్టస్ ఆయిల్ ను తీస్తారు. ఈరోజు మనం ఈ ఆయిల్ ను ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసుకుందాం
వైరస్ వచ్చినప్పుడు నుంచి..చాలామంది ఆవిరి పట్టుకుంటున్నారు. అలా ఆవిరిపట్టే క్రమంలో..యూకలిప్టస్ ఆయిల్ వేసి పడితే..వైరస్ మీద పోరడటానికి, మన శ్వాస సంబంధమైన నాళాల్లో ఉన్న ఇబ్బందులను, కఫం శ్లేష్మాలను తొలగించటానికి బాగా పనికొస్తుంది.
మన ఊపిరితిత్తుల్లో ముఖ్యంగా సీలియా అనే వెంట్రుకలు లాంటివి ఉంటాయి..మైక్రోస్కోప్ లో చూస్తేనే కనిపిస్తాయి.. శ్లేష్మం రావడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇవి బాగా యాక్టీవ్ అయ్యేట్లు ఈ ఆయిల్ చేస్తుంది. గాలితిత్తుల్లో కఫాలు, శ్లేష్మాలు బయటకు వచ్చేస్తే..ఆక్సిజన్ బాగా వెళ్తుంది. వైరస్ వచ్చినవారికి ఆక్సిజన్ సరిగ్గా అందకే..ఆయసపడుతుంటారు.
ఆ ఆయిల్ సినియోలి అనే కెమికల్ ఉంది. ఈ కెమికల్ నొప్పిని మోసుకెళ్లే నరాల్ని..నిప్పొని తట్టుకునేట్లు యాక్టివ్ గా చేస్తుంది. అందుకే నొప్పి ఉన్నా మనకు తెలియదు. ఇంకా ఈ యూకలిప్టస్ ఆయిల్ లో ఫినోలిక్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని జాయింట్స్ మీద అప్లైయ్ చేసినప్పుడు బాగా తగ్గుతాయి. అయితే అప్లై చేసేప్పుడు కొంతమందికి డైరెక్టుగా రాస్తే..మండుతుంది. అలాంటివారు..కొబ్బరినూనెలో కలిపి రాసుకుని అప్లై చేసుకోవచ్చు. ఘాటైనవి అలవాటే అనుకున్నవారు..డైరెక్టుగా రాసుకోవచ్చు.
తలనొప్పి, దగ్గు ఎక్కువ అవడంతో గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసి వేడినీళ్ల కాపడం రాస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
జలుబు చేసినప్పుడు ముక్కుబ్లాక్ అయిపోయి గాలాడదు..ఇలాంటివారు..యూకలిప్టస్ ఆయిల్ సీసా ఓపెన్ చేసి..ఆ వాసన పీలిస్తే చాలు..ఆ స్మెల్ కు బ్లాకేజెస్ తగ్గి సైనస్ సంధుల్లో ఏదైనా అడ్డును తొలగించి..గాలిఆడేట్లు చేస్తుందట.
ఆస్తమా పేషెంట్స్ కు కొబ్బరినూనెలో కలిపి యూకలిప్టస్ ఆయిల్ ఛాతికి రాస్తే చాలా రిలీఫ్ వస్తుందట..
యూకలిప్టస్ ఆయిల్‌ను లేదా ఆకుల పేస్ట్‌ను గాయాలు, పుండ్లపై రాస్తుంటే త్వరగా మానతాయి.
ఇంకా ఈ ఆయిల్ తో పాటు..టీట్రీ ఆయిల్ ను సమపాళ్లలో కలిపి తలలో రాసుకుంటే తలలో ఉండే పేలు చచ్చిపోతాయి. చుండ్రు సమస్య పోతుంది.
యాకలిప్టస్ ఆయిల్ దొరకనివారు..యూకలిప్టస్ ఆకులు నీళ్లలో వేసి ఆ ఆవిరి అయినా పట్టుకోవచ్చు.
నోటి దుర్వాసన, దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు యూకలిప్టస్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని నీటిలో వేసి ఆ నీటిని నోట్లో వేసుకుని బాగా పుక్కిలిస్తే…సమస్యలు తగ్గుతాయి. యూకలిప్టస్ ఆయిల్‌లో ఉండే.. యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. నోరు శుభ్రంగా మారుతుంది.
యూకలిప్టస్ ఆయిల్, నీటిని తీసుకుని మిశ్రమంగా చేసి స్ప్రే బాటిల్ లో పోసుకుని ఆ మిశ్రమాన్ని మస్కిటో రిపెల్లెంట్‌గా ఉపయోగించవచ్చు. దాంతో..దోమలు ఉండవు.
డైలీ యూకలిప్టస్ ఆయిల్ నీళ్లలో కలిపి తాగితే షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు ఎలుకలపై చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఇలా వాడేముందు మాత్రం వైద్యులను సంప్రదించాల్సిందే. అలాగే నీటిలో కలపకుండా యూకలిప్టస్ ఆయిల్‌ను నేరుగా తీసుకోకూడదు.
ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి..అందరి ఇళ్లలో ఈ ఆయిల్ కచ్చితంగా ఉండాల్సిందేగా మరీ..!
-Triveni Buskarowthu