మావోయిస్టు కీల‌క నేత సావిత్రి లొంగుబాటు

-

సావిత్రి లొంగుబాటు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడారు. మావోయిస్టు కీల‌క నేత సావిత్రి బాట‌లోనే మిగ‌తా మావోయిస్టులు కూడా లొంగిపోవాల‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి కోరారు. 30 ఏండ్ల పాటు ఆమె మావోయిస్టు పార్టీలో చురుకుగా ప‌ని చేసింద‌ని, పోలీసుల‌పై జ‌రిపిన 9 ప్ర‌ధాన దాడుల్లో ఆమె పాల్గొన్నార‌ని తెలిపారు డీజీపీ. మూడేండ్ల క్రితం త‌న భ‌ర్త మావోయిస్టు రామ‌న్న చ‌నిపోయిన‌ప్పుడు క‌నీసం త‌న‌కు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని సావిత్రి తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యారని, మారిన ప‌రిణామాలు, గిరిజ‌న ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న నేప‌థ్యంలో సావిత్రి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లుస్తారని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. సావిత్రి బాట‌లోనే మిగ‌తా మావోయిస్టులు లొంగిపోవాల‌ని మ‌హేంద‌ర్ రెడ్డి కోరారు. సావిత్రిపై ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో రూ. 10 ల‌క్ష‌ల రివార్డు ఉంద‌ని పేర్కొన్నారు. త‌క్ష‌ణ సాయం కింద సావిత్రికి రూ. 50 వేల‌ను అందించారు డీజీపీ మహేందర్ రెడ్డి.

1993లో సావిత్రి ఛ‌త్తీస్‌గ‌ఢ్ కుంట ద‌ళంలో చేరారు. ఆ స‌మ‌యంలో రామ‌న్న మావోయిస్టు నాయ‌కుడిగా ప‌ని చేశారు. ద‌ళంలో చేరిన త‌ర్వాత రామ‌న్న‌తో సావిత్రికి వివాహం జ‌రిగింది. 30 ఏండ్ల‌లో 350 మంది ఆదివాసీల‌ను సావిత్రి మావోయిస్టు పార్టీలో చేర్పించారు. సావిత్రి కుమారుడు రంజిత్ మావోయిస్టుగా ప‌ని చేసి ఏడాది క్రితం లొంగిపోయాడు. రాష్ట్రంలోకి మావోయిస్టులు ఎప్పుడైనా ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉన్నార‌ని ఓ జ‌ర్న‌లిస్టు అడిగిన ప్ర‌శ్న‌కు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version