తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది – మర్రి శశిధర్ రెడ్డి

-

బీజేపీ పార్టీ లో  మర్రి శశిధర్ రెడ్డి చేరారు. ఢిల్లీలో ఇవాళ బీజేపీ కండువా కప్పుకున్నారు మర్రి శశిధర్ రెడ్డి. బీజేపీ కండువా కప్పి మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు శర్భానంద సోనోవాల్. ఇక ఆయన వెంట బీజేపీ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ కూడా ఉన్నారు. శశిధర్ రెడ్డి వాస్తవానికి జెపి నడ్డా సమక్షంలో బిజెపి పార్టీలో చేరాల్సి ఉంది. కానీ ఆయన సమయానికి అందుబాటులో లేకపోవడంతో సోనావాల్ సమక్షంలో శశిధర్ రెడ్డి బిజెపి పార్టీలో చేరారు.

అనంతరం మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది అని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పార్టీని ఎదురుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని, 8 ఏళ్లుగా తెలంగాణలో అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతుందని.. తాను ఎంతో ఆలోచించిన తర్వాతే బిజెపిలో చేరాను అని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం బిజెపితోనే సాధ్యమవుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version