Breaking News : ఆగివున్న ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లా మైలవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కర్మలవారి పల్లె గ్రామ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఉన్న లారీని వెనుకనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో కారు ఉన్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు.

One dies and six injured in accident on Hyderabad ORR

అయితే.. మృతులు మైలవరం మండలం దోమ నంద్యాల గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వెంకటసుబ్బయ్య, లక్ష్మీ మునెమ్మ, వెంకట సుబ్బమ్మలు అనే ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరకున్న అంబులెన్స్‌లో స్వల్ప గాయాలతో ఉన్న డ్రైవర్‌తో పాటు చిన్నారిని తరలించారు.