మెగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. మెగా 154 సినిమా విడుదల తేదీపై క్లారిటీ

-

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రాల్లో ఒక‌టి మెగా154 బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోంది. అయితే.. ఈ సినిమాలో ర‌వితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న మెగా 154లో శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్. మెగా 154 సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్‌ టీం. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ముందుగా వచ్చిన వార్తల ప్రకారం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

Confirmed: Mega 154 to hit screens on this date | 123telugu.com

2023 జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. సంక్రాంతికి కలుద్దాం అనే క్యాప్షన్ తో అప్డేట్ ఇచ్చింది టీం. మాస్ మూల విరాట్ ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా అంటూ ట్వీట్ చేశాడు బాబీ. 3 పాటలు, కొంత టాకీ పార్ట్‌ మినహా మెగా 154 సినిమా షూటింగ్‌ పూర్తయినట్టు సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ప్లాన్‌ చేసుకుంది చిరంజీవి టీం. ఈ సినిమాలో ర‌వితేజ వైజాగ్ రంగ‌రాజు అనే మాస్ పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడని టాలీవుడ్ స‌ర్కిల్ టాక్.

 

Read more RELATED
Recommended to you

Latest news