231 కిలో మీటర్ల నుంచి నడిచి వచ్చిన అభిమానులు.. హత్తుకుని అప్యాయంగా పలకరించిన చరణ్

-

మెగా హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు చాలా ఎక్కువగా ఉంటారు. వాళ్ల సినిమాలు వస్తే సినిమా ధియేటర్లను అందంగా అలంకరించి తొలి షోనే చూస్తారు. సినిమాలు చూసేటప్పుడు ఎగిరి గంతులేస్తారు. ఈలలు, చప్పట్లతో కేరింతలు కొడతారు. సినిమా పూర్తి అయ్యే వరకూ ధియేటర్లు దద్దరిల్లిపోతాయి. సినిమా బాగుంటే మళ్లీ మళ్లీ చూస్తుంటారు. ఇక తమ అభిమాన హీరోలను ఎప్పుడు కలుద్దామా?. ఫొటో దిగుదామా అని ఉవ్విల్లూరు తుంటారు. అభిమానుల్లో కొందరైతే వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తారు. తమ అభిమాన హీరోలను కలిసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలా సినిమా ఫంక్షన్లు, తదితర కార్యక్రమాల్లో తమ హీరోలను కలిసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.

తాజాగా ముగ్గురు అభిమానులు సంధ్య జయరాజ్, రవి, వీరేశ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలవాలనుకున్నారు. అందుకోసం జోగులాంబ జిల్లా నుంచి 4 రోజుల క్రితం బయల్దేరారు. మొత్తం 231 కిలో మీటర్లు నడిచి హైదరాబాద్ చేరుకున్నారు.

శుక్రవారం మధ్యహ్నం రామ్ చరణ్ తేజ్‌ను కలిశారు. ఇక అంతదూరం వచ్చిన అభిమానులను రామ్ చరణ్ హత్తుకున్నారు. అంతటి అభిమానాన్ని చాటుకున్న జయరాజ్, రవి, వీరేశ్‌తో ముచ్చటించారు. వారితో ఫొటోలు దిగి హర్షం వ్యక్తం చేశారు. వారి అభిమానం మర్చిపోలేదని రామ్ చరణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version