మెగాస్టార్ చిరంజీవి స్టామినా నే వేరబ్బా..!!

-

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజం గా అందరికి తెలిసిందే. ఇక తాను అంతకు ముందు సినిమాలను వదిలి తాను బాధపడి, అభిమానులను కూడా భాద పెట్టారు. రాజకీయాలలో ఎంతో మంది ఎన్నో విమర్శలు చేశారు. ఇక మళ్లీ రాజకీయాలు వదిలి సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు.

ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తున్న హీరోలలో చిరంజీవి మాత్రమే ఉన్నారని చెబితే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఒక సంవత్సరం వ్యవధిలో తనవి రెండు సినిమాలు విడుదల అయ్యి మరో సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కోసం రెడీగా వుంది. మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇలాంటి ఫీట్ ఇప్పుడున్న యంగ్ హీరోలకు కూడా సాధ్యం కాదు.

ఇప్పటికీ తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కథలు వినడానికి టైమ్ ఇస్తున్నారట. ఇక వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వెంటనే బోళా శంకర్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడున్న హీరోలలో మహేశ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలలో ఇంత స్పీడ్ గా చేయటం లేదు. చిరు కూడా తాను అంతకు ముందు చేయాలని అనుకున్న డైరెక్టర్స్ జాబితా తీసి వరసగా లైన్ లో పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version