ఓ వ్యాపారి నిర్లక్ష్యం విద్యార్థి ప్రాణాల మీదికి తెచ్చింది.విజయవాడలోని ఎనికేపాడులో డిగ్రీ చదువుతున్న విద్యార్థి మంచినీటి బాటిల్ కోసం వస్తే..ఆ షాపులో ఉన్న వ్యాపారి ఏమరుపాటుతో ప్రవర్తించాడు.మంచినీళ్లకు బదులుగా యాసిడ్ బాటిల్ ఇవ్వడంతో వేసవికాలంలో దాహంతో ఉండి అక్కడకు వచ్చిన చైతన్య అనే స్టూడెంట్ బాటిల్ ను ఓపెన్ చేసి వెంటనే తాగేశాడు.యాసిడ్ అని ఇద్దరికీ తెలియకపోవడంతో కాసేపటికే అస్వస్థతకు గురయ్యాడు
అప్పటికే పూర్తి దాహంగా ఉన్న ఆ విద్యార్ది అది ఏంటి అని చూడకుండా ?గడగడా అంటూ ఆ బాటిల్లోని యాసిడ్ తాగేసాడు.దీంతో విద్యార్థి నోరంతా మండింది.అన్ని అవయవాల్లోకి ఆ యాసిడ్ వెళ్ళిపోయింది.దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
ఈ ఘటన ఈనెల 14వ తేదీన చోటు చేసుకుంది.బాటిల్ తాగి కిందపడి పోయిన విద్యార్థిని గమనించాక తాను ఇచ్చింది వాటర్ బాటిల్ కాదు..యాసిడ్ బాటిల్ అని గుర్తించాడు వ్యాపారి.విద్యార్థి స్నేహితుడు కూడా పక్కనే ఉండడంతో..వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా..అంతర్గత అవయవాల పై తీవ్ర ప్రభావం చూపించిందని చికిత్స మొదలు పెట్టారు.లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పరిస్థితికి జాలిపడిన కాలేజీ యాజమాన్యం, తోటి విద్యార్థులు విరాళాలు సేకరించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు.విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విద్యార్థి చైతన్యకు నాలుగు రోజులుగా చికిత్స కొనసాగుతోంది.చైతన్య ఆరోగ్య పరిస్థితి మెరుగు పడాలని తోటి విద్యార్థులు కోరుకుంటున్నారు.ఇలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.