ఒమిక్రాన్‌ విలయం.. 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులతో పాటు.. ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మన ఇండియాలో.. ఒమిక్రాన్‌ కేసులు.. 1000 కి చేరువలో నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే… కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇందులో భాగాంగానే.. తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్, “కోవిడ్” కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.

ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. “కరోనా” పరీక్షలను పెంచడంతో పాటు, ఆస్పత్రులలో మౌలిక వసతులను బలోపేతం చేయాలని, వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచనలు చేస్తూ ఈ లేఖలో పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్ల కచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని… పేర్కొన్నారు. పరిస్థితి అదుపు తప్పితే.. ప్రమాదం తప్పదని హెచ్చరించారు. కాబట్టి.. కరోనా, ఒమిక్రాన్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news