ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురం లోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీ లో ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తుండగా మంత్రి అస్వస్థతకు లోనయ్యారు. లో బిపి, ఆయాసం తో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆయనకు జార్జీ ఇంజనీరింగ్ కాలేజీలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో మంత్రి సురేష్ కు వైద్యులు యాంజియోగ్రామ్ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల జరిగిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ ఇలాగే అస్వస్థతకు గురయ్యారు. సామాజిక న్యాయ బేరి బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొని ప్రసంగించిన మంత్రి ఆదిమూలపు సురేష్ అనంతరం అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స అనంతరం యాంజియోప్లాష్టి చేశారు. అయితే నేడు మరోసారి అస్వస్థతకు గురయ్యారు మంత్రి సురేష్.