ఈ దసరాకు విశాఖ ప్రజల కోరిక నెరవేరనుంది : మంత్రి అమర్నాథ్‌

-

విశాఖ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా కోలా గురువులు బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ నాథ్, మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విశాఖకు రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ దసరాకు విశాఖ ప్రజల కోరిక నెరవేరనుందని, పార్టీ నాయకత్వం కోరుకున్న శుభపరిణామం జరుగుతుందని మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల ద్వారా సీఎం జగన్ విశాఖకు రానున్నారనే పరోక్ష సంకేతాలు ఇచ్చారని పార్టీలో భావిస్తున్నారు. మంత్రి మాట్లాడుతూ… దసరాకు మన ప్రాంతానికి బ్రహ్మాండమైన కానుక వస్తోందన్నారు. జగన్ ఇక్కడ వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి కార్యకలాపాలకు నిన్ననే శంకుస్థాపన చేశారన్నారు. మొదటి నుండి పార్టీ కోసం పని చేసిన వారికి పార్టీలో అన్యాయం జరగదని చెప్పారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి అన్యాయం చేసిన నలుగురిపై వేటు వేసిన ధైర్యం జగన్‌దే అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version