రాజకీయ పార్టీలకు ఏ ఎన్నికైన ప్రతిష్టాత్మకమైనదే – మంత్రి బొత్స

-

విజయనగరం సుజాత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో వైసీపీ నాయకులు కార్పరేటర్ లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో సమ్మిట్ లు నిర్వహించారని.. మరెవ్వరూ నిర్వహించనట్టు ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారని ఆరోపించారు.

నిన్న జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో విశాఖలో నిర్వహించిన సమ్మెట్టు చాలా క్రమశిక్షణ గా నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కి దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేతలు వచ్చారని.. హుందాగా ఎంవోయూలు చేసుకున్నారని తెలిపారు. ఊరకే చెప్పుకోవడాలు కాదు… చేసి చూపిచాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తన అధ్యక్షతనే కమిటీ వేసి ఎంవోయూలపై నిరంతరం పర్యవేక్షిస్తామని సీఎం జగన్ వెల్లడించారని తెలిపారు.

ఎంవోయూలే ముఖ్య కాదని.. గ్రౌండింగ్ ముఖ్యమని మా ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. 13 న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబో తున్నాయని.. ఉత్తరాంధ్ర జిల్లాలో రెండు లక్షల డెబ్భై వేల మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ఒక్క పట్టణంలోనే 17 వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని వివరించారు. ఒక్కొక్క బూత్ కు 8వందల మంది ఉంటారని తెలిపారు. రాజకీయా పార్టీ లకు ఏ ఎన్నికైనా ప్రతిష్ఠాత్మకమైనదే అన్నారు బొత్స సత్యనారాయణ. ఏ ఎన్నికనైనా బాధ్యతగా తీసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news