1.20 లక్షల మంది బీసీ బిడ్డలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నాం – మంత్రి గంగుల

-

బీసీ స్టడీ సర్కిల్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1.20 లక్షల మంది బీసీ బిడ్డలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నామని.. గ్రూప్1 ఉద్యోగల భర్తీ లో ఎటువంటి పైరవీలకు తావు లేదని వెల్లడించారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన ప్రజల ప్రభుత్వం, బీసీ కులాలు అభివృద్ధి కీ పడుపడే ప్రభుత్వమని.. ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మీ పధకం ద్వారా డబ్బులు ఇస్తున్న ఏకైక నాయకులు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.


నా చేతుల మీద ఎంతో మంది ఆడబిడ్డలను చెక్కులు అందజేశానని.. మా బీసీల అభివృద్ధి కీ జిల్లాలో పాటుపడుతున్న మంత్రి అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు,రాష్ట్రంలో బీసీ అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీసీ లు రుణ పడి ఉంటారని చెప్పారు. తెలంగాణ రాష్టం రాక ముందు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి లు ఉన్నారు…..కానీ బీసీ లకు చేసింది ఏమి లేదని.. 75ఏళ్ల లో ఏ ప్రభుత్వం బీసీలను పట్టిచుకోలేదని పేర్కొన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీసీ ల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని.. బీసీ కులాలకు గత పాలకులు చదువు దూరం చేశారన్నారు. 75 ఏళ్ల పాలనలో 19 బీసీ గురుకులు మాత్రమే ఉన్నాయని.. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ బిడ్డలను ముందుకు తీసుకొని పోవటానికి 200 బీసీ గురుకులను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బీసీ బిడ్డలు సీఎం కేసీఆర్ కలిపిచిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version