కోర్టు తీర్పును ఉల్లంఘించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది : మంత్రి జగదీష్‌ రెడ్డి

-

కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. విద్యుత్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని అయితే విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వలోనిదేనని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. బహిరంగ విపణిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లు, అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై మండిపడ్డారు జగదీష్ రెడ్డి. ఈ మేరకు మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు జగదీష్ రెడ్డి.

రాష్ట్రంలో విద్యుత్ కోతలు విదించాల్సి వస్తే దానికి ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలపై ఇప్పటికే రాష్ట్ర  ప్రభుత్వం కోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు పొందిందన్నారు జగదీష్ రెడ్డి. అయినా కోర్టు తీర్పును ఉల్లంఘించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విరుచుకుపడ్డారు జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ ఈ తరహా కుట్రలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన, దళిత, గిరిజనులకు అందించే సబ్సిడీలు ఎత్తి వేయాలన్నదే బీజేపీ ఎజెండా అని విమర్శించారు జగదీష్ రెడ్డి. విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాలు అన్నది పూర్తిగా ఆయా రాష్ట్రాల పరిధిలోనిదని, లేని అధికారంతో రాష్ట్రాలలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఏందంటూ విరుచుకుపడ్డారు జగదీష్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version