నాగార్జునసాగర్ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన ఐటి, పరిశ్రమల శాఖ & మున్సిపల్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి KTR…ఈ సందర్భంగా మాట్లాడారు. ఆరు దశాబ్దాల కాలం పదవిలో ఉన్న నేతలు చేయని అభివృద్ధి ఈరోజు ఎమ్మెల్యే భగత్ చేస్తున్నారు… సాగర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధి కి కారణమన్నారు.
గత పాలకులు పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వారు చేయని, చేయలేని పనులు భగత్ చేస్తున్నాడని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు..నాగార్జున సాగర్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి బాధ్యత మాదని వెల్లడించారు.
ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో వచ్చే నేతలను నమ్మొద్దని తెలిపారు. యువనాయకుడు భగత్ ను కపడుకోవలసిన బాధ్యత నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. నందికొండ, హాలియా లో డిజిటల్ లైబ్రరీ, ఆధునిక బస్ స్టాండు, ఆడిటోరియం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రోడ్లు వెడల్పు, డ్రైనేజీ… వాకింగ్ ట్రాక్..వైకుంఠ ధామం లకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.