కూల్ రూఫ్ విధానాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్.. ఇకపై సమ్మర్​లోనూ ఇల్లు చల్లగానే.. !

-

కూల్ రూఫ్ విధానాన్ని ఆవిష్కరించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కోసం చేపట్టిన మంచి కార్యక్రమం కూల్ రూఫ్ అన్నారు. తాత్కాలిక లక్ష్యాలతో, అందరికీ లాభం చేకూరేలా పాలసీ ఉంది.. హైదరాబాద్ దేశంలోనే ఎక్కువ ఆఫీస్ స్పేస్ తీసుకుంటున్న నగరం అని చెప్పారు. బెంగుళూర్ ను ఆఫీస్ స్పేస్ తో పాటుగా, ఎంప్లాయ్ మెంట్ లో కూడా హైదరాబాద్ దాట వేశాము.. తెలంగాణ లో అన్ని డిపార్ట్ మెంట్ లు చాలా బాగా పని చేస్తున్నాయి… మన దేశానికే ఆదర్శంగా ఉన్నామన్నారు.


2014 లో ఈ సి బి సి ని అడాప్ట్ చేసుకున్నాము… హరిత హారంలో మొక్కలు నాటుతున్నాం, ఎన్నో అవార్డ్ లు గెలుచుకున్నామని వెల్లడించారు. ఎనర్జీ ఎఫిషియంట్ మెషిన్ లను వాడమని చెబుతున్నాము… మన భవిష్యత్ తరాల కోసం తెస్తున్న పాలసీ ఇది అని చెప్పారు. ఈ సంవత్సరం నగరంలో 5 స్క్వేర్. కిమి, నగరం అవతల 2.5 స్క్వేర్ కిమీ కూల్ రూఫ్ చేస్తాము… సైకిల్ ట్రాక్ కు సోలార్ రూఫ్ చేస్తున్నామన్నారు.

భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ వెహికిల్ ల్లదేనని.. చట్టం తేవడం ఈజి, పాటించడమే కష్టం అన్నారు. మా ఇంటికి ముందే కూల్ రూఫ్ చేపించాను.. రూఫ్ తో పాటు వాల్స్ కు కూడా వేయాలని వెల్లడించారు. దీనిని తప్పనిసరి చేస్తున్నాము. కూల్ రూఫ్ ఉంటేనే అక్యూపెన్సి సర్టిఫికెట్ ఇస్తారు… కూల్ రూఫ్ ను అమలు చేస్తే రెండు సంవత్సరాల్లో ఎనర్జీ సేవింగ్ రూపంలో మన డబ్బులు మనకు వస్తాయన్నారు. హైదరాబాద్ తో పాటుగా మునిసిపాలిటి లలో దీన్ని అమలు చేయాలి… ఉన్న బిల్డింగ్ లకు కూడా వీటిపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలకు అవగాహన కల్పిస్తే 100 శాతం అమలవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version