నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తారు. 11.30 గంటలకు జిల్లా రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు మంత్రి కేటీఆర్. మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లో జిల్లా న్యాయవాదులతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు. 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేటకు చేరుకుంటారు మంత్రి కేటీఆర్.

KTR continues tirade against BJP on Twitter

మధ్యాహ్నం 2.30 గంటలకు గంభీరావుపేటలో జగదాంబదేవీ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం ముస్తాబాద్‌ మండలంలో యాదవ సంఘ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు వారివారి నియోజకవర్గాల్లో ప్రజల్లో మమేకం కావాలని, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలుకు వివరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.