మరోసారి మంత్రి మల్లారెడ్డి నిరసన సెగ

-

మంత్రి మల్లారెడ్డికి మరోసారి సొంత ఇలాకాలో నిరసన సెగ తగిలింది. మూడు చింతలపల్లి మండలంలోని పలు గ్రమాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉషారుపల్లి గ్రామంలో మంత్రి కాన్వాయిని మహిళలు ఆపారు. ఉషారుపల్లి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అద్వానంగా ఉన్నాయంటూ మంత్రిపై ఫైర్ అయ్యారు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మా గ్రామం గుర్తస్తుందా అంటూ మంత్రిని నిలదీశారు. డబుల్ బెడ్ రూంలు ఇప్పిస్తామని ఇచ్చిన హామీలు ఏం అయ్యాయని ప్రశ్నించారు. సొంత ఇండ్లు లేక పేదవారు ఇబ్బందులు పడుతున్నారని.. స్థానికులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మేడ్చల్ మండల అధ్యక్షుడు పరిశురాం మాదిగ మాట్లాడుతూ నాలుగో వార్డులో నిర్మించిన డబుల్ బెడ్ రూంలను స్థానికులకే చెందేలా చూడాలని మంత్రిని కోరారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఎస్సీ కమ్యూనిటీ భవనం శిథిలావస్థలో ఉన్న దానిని పట్టించుకునే వారు లేరని వెంటనే ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా వార్డులో బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకొని నిరసనకారులను అక్కడి నుంచి పంపించేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బాల నరసింహ, నాగరాజు, భాస్కర్, రాజు, నవీన్, మహేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version