అభివృద్ధిలో విషయంలో ఎలాంటి వివక్ష లేదు : మంత్రి నిరంజన్‌ రెడ్డి

-

వనపర్తి జిల్లా కిష్టగిరి సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి సవాయిగూడెం, కిష్టగిరి, పెద్దగూడెం, దత్తాయిపల్లి, దావాజిపల్లి గ్రామాలకు సాగు నీరు అందించేందుకు ఖాన్ చెరువు వరకు కొత్తకాలువ నిర్మాణానికి రూ.18.66 కోట్లతో అనుమతులు మంజూరు చేయడంపై వనపర్తి నియోజకవర్గ రైతుల కృతజ్ఞత, అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డ మాట్లాడుతూ.. నమ్మిన లక్ష్యమం కోసమే తన పోరాటమని, ప్రజల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నామని అన్నారు. గతంలో మోరీ కాల్వలు, కమ్యూనిటీ హాళ్లు కట్టి అదే గొప్ప అని చెప్పుకునేదని, నియోజకవర్గంలో రూ.25 కోట్లతో చెక్ డ్యాంలను నిర్మాణం చేయడం జరిగిందన్నారు. పట్టుబట్టి సాగునీళ్లను తెచ్చి ప్రతి ఊరిని సస్యశ్యామలం చేశామని, రాష్ట్రంలో భూగర్భజలాలు అత్యధికంగా పెరిగిన జిల్లా వనపర్తి అన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. దశాబ్దాలుగా అదృశ్యమైన పిట్టలు, పక్షులు, జీవరాశి నేడు కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రాకతో తిరిగి కనిపిస్తున్నాయన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.

అభివృద్ధిలో విషయంలో ఎలాంటి వివక్ష లేదని, అందరూ బాగుండాలని అందులో మనం ఉండాలన్నదే మ ఆలోచన అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు ఇచ్చామన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. దత్తాయపల్లి వద్ద కాల్వను గత ఎన్నికల ముందు కొందరు అడ్డుకున్నారని, దత్తాయపల్లి నుంచి ఖాన్‌ చెరువు వరకు కాల్వను తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఇరిగేషన్, ఆర్థికశాఖలను కష్టపడి ఒప్పించానన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. ఖాన్ చెరువు కాల్వను తవ్వే విషయంలో రైతులందరూ సహకరించాలా వచ్చే యాసంగికి సవాయిగూడెం, కిష్టగిరి, పెద్దగూడెం, దత్తాయిపల్లి, దావాజిపల్లి గ్రామాలలోని 5 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు అందించాలన్నదే ఆకాంక్ష అన్నారు. ఇవి పూర్తయితే ఒక్క అంజనగిరి గ్రామమే సాగునీరందని గ్రామంగా ఉంటుందని, ఎత్తిపోతల ఏర్పాటు చేసి వచ్చే వానాకాలం నీరందించాలని ప్రయత్నిస్తున్నానన్నారు. అలాగే వనపర్తి తిరుమలయ్య గుట్ట అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version