అటవీ భూములకు సర్వే నెంబర్లు ఇవ్వకూడదు : మంత్రి పెద్దిరెడ్డి

-

అటవీ భూముల ఆక్రమణల పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అటవీ, రెవెన్యూ, సర్వే, సెటిల్ మెంట్ అధికారులతో ఈ రోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జగనన్న భూహక్కు-భూరక్ష కింద సర్వే జరుగుతోందని, సర్వే చేసే క్రమంలో ఆక్రమణకు గురైన అటవీభూములను నిర్థిష్టంగా గుర్తించాలన్నారు. చట్టప్రకారం అటవీ భూములకు సర్వే నెంబర్లు ఇవ్వకూడదని, ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చిత్తూరు, విశాఖపట్నం తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, సెటిల్ మెంట్ ఆఫీసర్ల పేరుతో భారీగా బోగస్ పట్టాలను పొందారన్నారు.

భూ సర్వే ద్వారా ఆక్రమిత భూములకు సర్వే నెంబర్లు పొందాలనే ప్రయత్నం జరుగుతోందని, ఆక్రమణలను రెగ్యులర్ చేసుకునేందుకు జరిగే ప్రయత్నాలను నిలువరించాలని ఆయన ఆధికారులకు ఆదేశించారు.
రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని, తప్పుడు ధ్రువీకరణలతో అటవీ భూముల్లో పొందిన పట్టాలను రద్దు చేయాలని ఆయన సూచించారు. అటవీ ప్రాంతాల్లో సర్వే వినతుల పై నోడల్ అధికారుల నియామకం జరుగుతుందని, ఆర్వోఎఫ్ఆర్ భూముల సరిహద్దులు కూడా నిర్ధిష్టంగా గుర్తించండని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version