దిల్లీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు పెంచిన ఈడీ ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. రేపు (గురువారం) రోజున విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై స్పందించిన కవిత ఈడీ విచారణకు సహకరిస్తానని.. కానీ విచారణ తేదీ మార్పుపై న్యాయ సలహా తీసుకుంటానని అన్నారు.
అయితే కవితకు ఈడీ నోటీసులివ్వడంపై బీఆర్ఎస్ మంత్రులు, నేతలు స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం రోజున కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మహిళా రిజర్వేషన్ లేకపోయినe ఖమ్మం, వరంగల్ నగరాలకు ఉపమేయర్‌ను మహిళను ప్రకటించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత దిల్లీలో రేపటి నుంచి నిరాహార దీక్ష చేయనున్న నేపథ్యంలో ఇవాళ ఈడీ నోటీసులు ఇచ్చిందని పువ్వాడ మండిపడ్డారు. ఈ చర్యతో కేంద్రం, బీజేపీ వైఖరి స్పష్టమైందని అన్నారు.