కేంద్ర బడ్జెట్ ని తాజాగా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ పై పలువురు విధాలుగా మాట్లాడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపెట్టారు. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు ఊపిరి పిల్చుకునేలా చేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో 20 ఏళ్లు వెనక్కి పోయింది. కేంద్రం సాయం అందించకపోతే, ఏపీ ఎంతో నష్టపోయేది. ఎన్నికలకు ముందే ప్రజలకు హామి ఇచ్చామని గుర్తు చేశారు. కేంద్రం లో మోడీ, ఏపిలో మోడీ వస్తే అభివృద్ధి సాధ్యం అని చెప్పాం.
అమరావతికి 15 వేల కోట్లు కేటాయించారు. అమరావతి అభివృద్ధి జరక్కుండా జగన్ అడ్డుకున్నారు. పోలవరం జీవనాడి ప్రాజెక్టు. జగన్ పోలవరాన్ని వెనక్కి తీసుకు పోయారు. ఇపుడు కేంద్రం హామి ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ ని కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి చేస్తామని తెలిపారు.