ఏపీలో పొత్తుల రాజకీయం సెగలు కక్కుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు ముచ్చట మొదలు పెట్టిన నాటినుంచి చిలికి చిలికి గాలివానల.. ఆఖరికి బీజేపీ-జనసేన పొత్తులతో సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ను ప్రకటించాలనేంతవరకు వచ్చింది. అయితే ఇటీవల పవన్ కల్యాణ్ 3 ఆప్షన్లు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి ఆర్కే రోజా పొలిటికల్ సెటైర్ వేశారు. పవన్ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసమేనని ఆరోపించారు రోజా.
సోమవారం రోజా మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పవన్‌ను రాష్ట్ర ప్రజలు రెండు చోట్ల ఓడించారన్నారు. 2024 ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని రోజా జోస్యం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశిస్తే… చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమని రోజా ధ్వజమెత్తారు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైసీపీకి వస్తుందని తెలిపారు రోజా. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా.