హైదరాబాద్‌ వాసులకు శుభవార్త..మొబైల్ SCTP వాహనాలను ప్రారంభించిన కేటీఆర్

-

పీపుల్స్ ప్లాజా వద్ద 20 మొబైల్ SCTP వాహనాలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వం లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నామని.. 2500 మెట్రిక్ టన్నుల నుండి 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు కలెక్ట్ చేస్తున్నారని వెల్లడించారు.

4500 స్వచ్ఛ ఆటోలను చెత్త కలెక్షన్ కోసం వాడుతున్నామని.. కొద్ది రోజుల్లో మరో 500 ఆటోలు రానున్నాయి. దీంతో మొత్తం 5000 ఆటోలు అవుతాయన్నారు. వాహనాల నుండి చెత్త రోడ్ల మీద పడకుండా మోడర్న్ టెక్నాలజీతో ఈ వాహనాలను తీసుకున్నామని… 17 ట్రాన్స్ఫర్ స్టేషన్ లను తొందరగా ఆధునికీకరణ చేయాలని పేర్కొన్నారు. 95 సెకండరీ కలెక్షన్ పాయింట్ లను ఏర్పాటు చేసుకున్నామని… 51మిగతా వాహనాలు వస్తే పరిస్థితి మరింత మెరుగు అవుతుందని.. 24 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్ ను జవహర్ నగర్లో ప్రారంబించుకున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version