ఆడియో – వీడియోలతో బిజెపి ఆగం అవుతుంది: ఎమ్మెల్యే బాల్క సుమన్

-

మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీలోని ఒకటవ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇందులో భాగంగా ఈవీఎం నమూనాతో రెండవ నెంబర్ వద్ద గల కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ ప్రచారంలో భాగంగా బల్క సుమన్ మాట్లాడుతూ.. ఫామ్ హౌస్ ఘటనకు సంబంధించి బయటకు వచ్చిన ఆడియో, వీడియోలతో బిజెపి పార్టీ ఆగం అవుతుందని ఎద్దేవా చేశారు.

ఇది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని అన్నారు బాల్క సుమన్. ఇకపై వచ్చే ఫుటేజీలు చూస్తే బిజెపి పరిస్థితి ఏమవుతుందోనని అన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంతో తమకు సంబంధం లేదన్న బిజెపి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు అప్పగించాలంటుంది? అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ దగ్గరకు నేతలు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు బాల్క సుమన్. బండి సంజయ్ కేవలం డమ్మీ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news