వాళ్లే హిందువులకు పుట్టినట్లు.. మేం ఇంకెవరికో పుట్టామన్నట్లు బిజెపి వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఒక ముఖ్యమంత్రి గా ఉండి ఇంకో ముఖ్యమంత్రి పై వాఖ్యలు చేయడం అస్సాం సాంప్రదాయమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాలు చెడగొట్టేందుకే అస్సాం సీఎం తెలంగాణకి వచ్చారా..? అంటూ మండిపడ్డారు. గణేష్ ఉత్సవ సమితి కాషాయ బట్టలు వేసుకొని.. విద్వేషాలు రెచ్చగొడుతుందని ఆరోపించారు.
నిమజ్జన కార్యక్రమంలో హిందూ, ముస్లిం ల మధ్య చిచ్చు పెట్టి.. గొడవలు సృష్టించే కుట్రలు చేశారని అన్నారు. అందుకోసం ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు..కేంద్ర మంత్రులు వచ్చారని అన్నారు దానం నాగేందర్. కాషాయ బట్టలు,టోపీలు పెట్టుకొని..అల్లర్లకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారని.. మత ఘర్షణలు సృష్టించెందుకే బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయానికి ఈ మధ్య తరచూ వెళ్తున్నారని అన్నారు.
తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని.. సీఎం కేసీఆర్ మత సామరస్యానికి కృషి చేస్తుంటే..బిజెపి మత ఘర్షణలు చేయాలని చూస్తుందన్నారు. నందుబిలాల్ ఎం తప్పు చేశారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నిరసన తెలిపారని అన్నారు.