గవర్నర్ తమిళి సై, బిఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరినట్లే ఉంది. ఎందుకంటే గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించిన ప్రభుత్వం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించింది. గవర్నర్ ప్రసంగం తోనే సమావేశాలను ప్రారంభించింది. సీఎం కేసీఆర్ స్వయంగా గవర్నర్ కి స్వాగతం పలికి సభలోకి తీసుకువచ్చారు.
అయితే గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ పై బిజెపి అసంతృప్తిలో ఉందన్నారు. ఒకవేళ బిజెపి తమిళసైని మార్చవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకి కాంగ్రెస్ కంటే బిజెపి చరిత్ర బాగా తెలుసునని అన్నారు జగ్గారెడ్డి. నేడు మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో జగ్గారెడ్డి ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.