తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రజాప్రతినిధులను భయపెడుతోంది. కొద్ది రోజుల క్రితం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాజాసింగ్ కుటుంబం మొత్తానికి పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షల్లో నెగిటివ్ రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ మహమ్మారి మాత్రం రాజాసింగ్ ని వెంటాడుతూనే ఉంది. తాజాగా.. రాజాసింగ్ దగ్గర పని చేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.
#Covid19 cases are increasing everyday in Hyderabad.
My 2 drivers & 3 security personnel has been tested Positive & result of 5 is awaiting since 5 days.@TelanganaCMO @Eatala_Rajender why this delay in reporting, the more it gets delayed chance of spreading the virus increases pic.twitter.com/ABnoYx16hB
— Raja Singh (@TigerRajaSingh) June 25, 2020
రాజా సింగ్ కారు డ్రైవర్స్ ఇద్దరికీ, ముగ్గురు గన్ మెన్స్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. మరో ఐదుగురి రిపోర్ట్స్ రావాల్సి ఉందని రాజా సింగ్ తెలిపారు. దీంతో మిగతా సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు అధికారులు. కాగా రాజాసింగ్ కు రేపు కరోనా నిర్దారిత పరీక్షలు జరపనున్నారు. ఇప్పటికే జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధర్, బీగాల గణేష్ గుప్తాకు కూడా వైరస్ సోకింది.