బడ్జెట్ లో ఎక్కువగా గత ప్రభుత్వాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కామెంట్స్ చేసారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చట్టబద్దత కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. ఇప్పుడు చట్టబద్దత అనే హామీ ఊసే మర్చిపోయారు. అభయహస్తం హామీలు 13 ఉన్నాయి బడ్జెట్ లో వీటికి చోటేది..? మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.2,500 ఉంది ఇస్తామన్నారు దానిగురించి ప్రతిపాదనే లేదు… ఎన్నికల ముందు రూ.500 కి గ్యాస్ అన్నారు అధికారంలోకి వచ్చాక షరతులు వర్తిస్తాయి అంటున్నారు.
చేయూత పథకం ద్వారా రూ.4 వేలు ఇస్తామన్నారు వాటి గురించి ప్రస్తావన లేదు. రైతులకు రైతు భరోసా ఇప్పటికి అందలేదు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో పంటలకు బోనస్ రూ.500 ఇస్తామన్నారు కానీ ఇప్పుడు సన్నాలకు మాత్రమే అంటున్నారు. కానీ తెలంగాణ లో 90 శాతం పండించేది దొడ్డు వడ్లు అవి పండించే వాళ్లకు ద్రోహం చేయవద్దు అని దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.