తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేశారా.. రాహుల్ పర్యటనపై కవిత ఫైర్

-

రాహుల్ గాంధీ పర్యటన పై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ? అని నిలదీశారు. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు , నిధుల గురించి టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు ?? ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన రైతుబంధు రైతు బీమా కళ్యాణలక్ష్మి ఆరోగ్యలక్ష్మి ఆసరా వంటి పథకాలపై ఆరాతీసి అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండి. సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను స్పూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవడానికి మీకు కూడా తెలంగాణకు స్వాగతం!! అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news