రాష్ట్రపతి ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. ఈ ఎన్నికలు జూలై 18న జరుగుతుండగా 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టిఎంసి, ఎన్సీపీ, టిఆర్ఎస్ తదితర పార్టీల మద్దతుతో యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. కాగా రేపు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన సదస్సు కార్యక్రమం చేపట్టనున్నారు.
ఓటు వేయడానికి ఎన్నికల కమిషన్ తన తరఫున పెన్ను ఇస్తుంది. ఇది బ్యాలెట్ పేపరును అందజేసే సమయంలో ఇవ్వబడుతుంది. ఈ పెన్ తో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. మరేదైనా పెన్నుతో ఓటు వేసినా ఓటు చెల్లదు. పార్లమెంటు లోని రెండు సభలు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. ఈ విలువ ఎంపీలకు ఒక విధంగా, ఎమ్మెల్యేలకు మరో విధంగా ఉంటుంది. అయితే రేపు తెలంగాణభవన్‌లో మాక్ పోలింగ్ నిర్వహించిన తరువాత తెలంగాణ భవన్ నుంచి అసెంబ్లీకి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.