లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేరళలోని పాలక్కాడ్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.’రెండు భారతదేశాలు’ ఉన్నాయన్నారు. ఒకటి బిలియనీర్లకు మాత్రమే సంబంధించింది. ఇక్కడ వారు కలలను నెరవేర్చుకోగలరు. మరొకదానిలో పెద్ద సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మన దేశంలో 70 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు 22 మంది మాత్రమే ఉన్నారు. అలాగే రోజుకు రూ.100 కంటే తక్కువ సంపాదించే వారు 70 కోట్ల మంది ఉన్నట్లు తెలిపారు. . తన ప్రసంగంలో పేద, మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్నులను గురించి మాట్లాడారు. ఇండియాలో అత్యంత పేద వ్యక్తి గౌతమ్ అదానీ అని ఆయన ఎద్దేవా చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ 25 మంది భారతీయుల 16 లక్షల కోట్ల విలువైన బ్యాంకు రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ. భారతదేశంలో అస్థిరతను సృష్టించడం, ఒక భారతీయుడు మరొక భారతీయుడితో పోరాడేలా చేయడమే బీజేపీ ఆలోచన అని విమర్శించారు. చివరికి, వారు చేసేదల్లా ప్రధానమంత్రికి సన్నిహితంగా ఉన్న కొంతమందికి ఇండియా సంపదను ఇవ్వడమే అని ఆయన మండిపడ్డారు.