రాజమౌళి దర్శకత్వంలో మోహన్ లాల్..సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?

-

భారత అగ్రదర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రస్తుతం ప్రతీ ఒక్క నటుడు అనుకుంటారు. RRR పిక్చర్ తో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా భారత సినిమా సత్తా చాటారు. తన ఇమేజ్ ను సినిమా సినిమాకు పెంచుకుంటూ పోయిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అని చెప్పొచ్చు.

అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళికి పేరుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ‘స్టూడెంట్ నెం.1’ పిక్చర్ చేసిన తారక్..తన తర్వాత ఫిల్మ్ ను మాలీవుడ్(మలయాళం) సంపూర్ణ నటుడు మోహన్ లాల్ తో చేయాలనుకున్నాడట. మైథలాజికల్ డ్రామాను చేయాలనుకున్నప్పటికీ అది మధ్యలోనే ఆగిపోయిందట. ఇందుకు భారీ బడ్జెట్ అవుతుందని ప్రాజెక్ట్ మధ్యలోనే డ్రాప్ అయినట్లు టాక్.

ఇక అప్పటికే కె.రాఘవేంద్రరావు తన తనయుడు సూర్య ప్రకాశ్ తో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ ప్లాన్ చేశాడు. కానీ, అది కూడా ఆగిపోయింది. ఇక సూర్య ప్రకాశ్ తొలి చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో ఇక భారీ బడ్జెట్ ఫిల్మ్స్ జోలికి ఇప్పుడే వెళ్లొద్దని జక్కన్న కూడా డిసైడ్ అయ్యారట. అలా రాజమౌళి-మోహన్ లాల్ కాంబినేషన్ పిక్చర్ ఆదిలోనే ఆగిపోయందట. జక్కన్న ప్రస్తుతం మహేశ్ బాబుతో పిక్చర్ చేయబోతున్నాడు. ఇక తొలిసారి మెగా ఫోన్ పట్టిన మోహన్ లాల్.. ‘బరోజ్’ పిక్చర్ షూటింగ్ లో ఉన్నాడు. ఈ ఫిల్మ్ కు దర్శకత్వం వహిస్తుండటంతో పాటు లాలెటా ఇందులో నటిస్తు్న్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news