1. తెలంగాణ రాష్ట్రం ఏయే అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
ఎ) 15°46′ – 19°47′ దక్షిణ అక్షాంశాలు
బి) 15°46′ – 19°47′ ఉత్తర అక్షాంశాలు
సి) 77°16′ – 81°43′ దక్షిణ అక్షాంశాలు
డి) 77°16′ – 81°43′ ఉత్తర అక్షాంశాలు
2.హైదరాబాద్‌లోని గ్రామీణ ప్రాంతాలను కలిపి ఏ జిల్లాగా ఏర్పాటు చేశారు?
ఎ) మెదక్
బి) నల్లగొండ
సి) మహబూబ్‌నగర్
డి) రంగారెడ్డి
3. తెలంగాణలో విస్తీర్ణం దృష్ట్యా అతి పెద్ద జిల్లాలు వరసగా?
ఎ) ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్
బి) మహబూబ్‌నగర్, ఆదిలాబాద్,నల్లగొండ
సి) మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్
డి) ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ
4. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత?
ఎ) 12
బి) 13
సి) 14
డి) 15
5. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న జిల్లాలు ఏవి (వరసగా)?
ఎ) రంగారెడ్డి, నిజామాబాద్
బి) హైదరాబాద్, మెదక్
సి) హైదరాబాద్, రంగారెడ్డి
డి) రంగారెడ్డి, మెదక్
6. కింది వాటిలో భూపరివేష్టిత జిల్లా ఏది?
ఎ) మహబూబ్‌నగర్
బి) నల్లగొండ
సి) వరంగల్
డి) హైదరాబాద్
7. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ విస్తీర్ణశాతం ఎంత?
ఎ) 2.4
బి) 12
సి) 10
డి) 3.49
8. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఎవరు నిర్మించారు?
ఎ) ఇబ్రహీం షా
బి) సుల్తాన్ కులీకుతుబ్‌షా
సి) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
డి) అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్‌షా
10. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ని మండలాలు ముంపునకు గురయ్యాయి?
ఎ) 5
బి) 7
సి) 9
డి) 33
9. మన రాష్ట్ర పండు ఏది?
ఎ) మామిడి
బి) సీతాఫలం
సి) ద్రాక్ష
డి) అరటి
11.‘సర్వే ఆఫ్ ఇండియా’ తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను అధికారికంగా ఏ రోజున విడుదల చేసింది?
ఎ) 2014 జూన్ 2
బి) 2015 జూన్ 2
సి) 2015 జూలై 2
డి) 2015 జూన్ 5
12. ఖమ్మం జిల్లా సీలేరు బేసిన్ పరిధిలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల తెలంగాణ ఏ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది?
ఎ) ఛత్తీస్‌గఢ్
బి) ఒడిశా
సి) మహారాష్ట్ర
డి) మధ్యప్రదేశ్
13. రాష్ట్రంలో అత్యధిక మండలాలున్న జిల్లా?
ఎ) ఆదిలాబాద్
బి) కరీంనగర్
సి) మహబూబ్‌నగర్
డి) ఖమ్మం
14. తెలంగాణ అధికారిక టీవీ చానల్ పేరు?
ఎ) యాదగిరి
బి) సప్తగిరి
సి) దూరదర్శన్
డి) భక్తి చానల్
15. రాష్ట్ర అధికారిక గీతమైన ‘జయ జయహే తెలంగాణ..’ను రచించింది ఎవరు?
ఎ) ఏలే లక్ష్మణ్
బి) అందె శ్రీ
సి) ఆచార్య జయశంకర్
డి) బాలకిషన్
జవాబులు:
1. తెలంగాణ రాష్ట్రం ఏయే అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
జవాబు: బి. 15°46′ – 19°47′ ఉత్తర అక్షాంశాలు
2.హైదరాబాద్‌లోని గ్రామీణ ప్రాంతాలను కలిపి ఏ జిల్లాగా ఏర్పాటు చేశారు?
జవాబు: డి. రంగారెడ్డి
3. తెలంగాణలో విస్తీర్ణం దృష్ట్యా అతి పెద్ద జిల్లాలు వరసగా?
జవాబు: బి. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్లగొండ
4. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత?
జవాబు: ఎ. 12
5. తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న జిల్లాలు ఏవి (వరసగా)?
జవాబు: సి. హైదరాబాద్, రంగారెడ్డి
6. కింది వాటిలో భూపరివేష్టిత జిల్లా ఏది?
జవాబు: డి. హైదరాబాద్
7. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ విస్తీర్ణశాతం ఎంత?
జవాబు: డి. 3.49
8. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఎవరు నిర్మించారు?
జవాబు: సి . మహమ్మద్ కులీ కుతుబ్‌షా
9. మన రాష్ట్ర పండు ఏది?
జవాబు: బి. సీతాఫలం
10. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ని మండలాలు ముంపునకు గురయ్యాయి?
జవాబు: డి. 33
11.‘సర్వే ఆఫ్ ఇండియా’ తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను అధికారికంగా ఏ రోజున విడుదల చేసింది?
జవాబు: డి. 2015 జూన్ 5
12. ఖమ్మం జిల్లా సీలేరు బేసిన్ పరిధిలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల తెలంగాణ ఏ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది?
జవాబు: బి. ఒడిశా
13. రాష్ట్రంలో అత్యధిక మండలాలున్న జిల్లా?
జవాబు: సి. మహబూబ్‌నగర్
14. తెలంగాణ అధికారిక టీవీ చానల్ పేరు?
జవాబు: ఎ. యాదగిరి
15. రాష్ట్ర అధికారిక గీతమైన ‘జయ జయహే తెలంగాణ..’ను రచించింది ఎవరు?
జవాబు: బి. అందె శ్రీ