అంధేరీలో దారుణం.. భార్యను కారుతో తొక్కించిన మూవీ ప్రొడ్యూసర్

-

ముంబయిలోని అంధేరీలో దారుణం జరిగింది. ఓ సినీ నిర్మాత తన భార్యను కారుతో తొక్కించాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దాడి దృశ్యాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

‘బాధితురాలి భర్త పేరు కమల్‌ మిశ్రా. అతడు సినీ నిర్మాత. భర్త ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె వెతుక్కుంటూ పార్కింగ్ ప్రదేశానికి వచ్చింది. అక్కడ కారులో ఉన్న తన భర్త వెంట మరో మహిళ ఉండటాన్ని ఆమె గమనించింది. వెంటనే ఆగ్రహంతో భర్తతో గొడవకు దిగింది. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా ఉన్న భార్యను పట్టించుకోకుండా అతడు వేగంగా కారు నడిపాడు. దాంతో ఆమె తల, కాళ్లూచేతులకు గాయాలయ్యాయి. గాయపడిన భార్యను వదిలి అతడు పరారయ్యాడు. ఘటనాస్థలంలో ఉన్నవారు ఆమెను ఆస్పత్రికి తరలించారు.’ అని పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న ఆమె భర్త కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version