ఎల్బీనగర్‌ లో ఎంపీ రేవంత్‌ రెడ్డి VS ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

-

ఎల్బీ నగర్ పరిధిలోని వాసవి నగర్ లోని జంట రిజర్వాయర్ల ప్రారంభోత్సవం రాజకీయ రగడకి కారణమైంది. ముహూర్తం 12గంటలకు ఉంటే ముందే ఎలా చేస్తారన్న దాని పై మొదలైన వివాదం ఎంపీ vs ఎమ్మెల్యే వార్ గా మారింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆయన రోడ్డుపై భైఠాయించారు. రోడ్డుపై టీఆర్ఎస్ జెండాలు చింపివేస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. దీంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.

ట్యాంక్ ప్రారంభం చేయాల్సిన సమయానికన్నా ముందే వచ్చిన కేటీఆర్ ట్యాంకును ప్రారంభించి వెళ్లిపోయారు. ముందే ఎలా చేస్తారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని, మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు ఎంపీ రేవంత్ రెడ్డి. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కొత్తపేటలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు రేవంత్‌ రెడ్డి.

ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి హైవేను దిగ్భందించారు. రోడ్డుపైనే టీఆర్‌ఎస్ జెండాలు చించేసి.. నిరసన తెలిపారు కాంగ్రెస్ నాయకులు. పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా.. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన దీక్షలో భాగంగా రేవంత్‌ ఆందోళనకు దిగారు. రేవంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news