వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు చేపట్టారు. ఏపీలో భారీ బడ్జెట్ చిత్రాల షూటింగులు ఇటీవలకాలంలో పెరిగాయని అన్నారు ఆయన. ఇది సంతోషించదగ్గ పరిణామం అని వ్యక్తపరిచారు. ఏపీలో పెద్ద సినిమాల చిత్రీకరణలు పెరగడానికి కారణం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమేని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. అధిక ఫీజులు వసూలు చెల్లించినవసరం లేకుండా రాష్ట్రంలో షూటింగులు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారని జగన్ ని కొనియాడారు ఆయన. సినిమా షూటింగుల్లో పెద్ద సంఖ్యలో కార్మికుల అవసరం ఉంటుందని, వందల సంఖ్యలో ప్రజలకు ఉపాధి కలుగుతుందని అన్నారు. ముఖ్యంగా, స్థానికులకు లబ్ది చేకూరుతుందని వెల్లడించారు విజయసాయిరెడ్డి.
ఇదిలా ఉంటే.. నిన్న ఢిల్లీలో సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సంసద్ రత్న అవార్డులు అందుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్.. రవాణా, సాంస్కృతిక, పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ అత్యుత్తమ పనితీరుకుగాను ఈ అవార్డు వచ్చింది.. ఈ సందర్భంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కానప్పటికీ పార్లమెంట్‌లో బాగా పనిచేస్తున్నారు.. ప్రతి అంశంలో ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు వేస్తున్నారు అని ప్రశంసించారు.. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పనితీరును గమనించాను.. ఆయన పార్లమెంటు కార్యక్రమాలలో చాలా పరిశ్రమిస్తారని తెలిపారు బండారు దత్తాత్రేయ.