BREAKING : మునుగోడు ఉపఎన్నికకు ముహూర్తం ఖరారు !

-

మునుగోడు ఎమ్మెల్యే పదవికి అలాగే తన కాంగ్రెస్ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక నివార్యమైంది. మరో వారం రోజుల్లో బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి తరఫున ఈ ఉప ఎన్నికల్లో బరిలో ఉండనున్నారు.

అటు టిఆర్ఎస్ పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మరోసారి బరిలోకి దించుతారని ప్రచారం సాగుతోంది. అలాగే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు కూడా టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. హుజూరాబాద్  తరహాలో తప్పులు చేయకుండా ముందుగానే అభ్యర్థిని ప్రకటించాలని ఆలోచన చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికల తేదీపై ఓ జాతీయ మీడియా కీలక ప్రకటన చేసింది. అక్టోబర్లో మునుగోడు ఉప ఎన్నిక ఉంటుందని.. ఆ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఉప ఎన్నికపై ఇప్పటికే బీజేపీ నాయకులకు ఆదేశాలు జారీ అయ్యాయని… అందరూ మునుగోడుపై ఫోకస్ చేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకుందని కూడా ఈ మీడియా సంస్థ తెలిపింది. అయితే ఆ మీడియా సంస్థ తెలిపినట్టే అక్టోబర్లో మునుగోడు ఉప ఎన్నిక వస్తుందో? రాదో ?చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version