మునుగోడు ప్రజలు తెలివైన తీర్పు ఇచ్చారు – జూలకంటి

-

మునుగోడు ప్రజలు తెలివైన తీర్పు ఇచ్చారని అన్నారు సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి. సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికని బిజెపి కావాలని తీసుకువచ్చిందన్నారు. కుట్రపూరితంగా ఎన్నిక తీసుకువచ్చి గెలవాలని కుట్ర పన్నారని ఆరోపించారు. అయినప్పటికీ మునుగోడు ప్రజలు తెలివైన తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు.

అలాగే మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీపీఐ, సీపీఎం నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మునుగోడు ని అందరి సహకారంతో అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామన్నారు. ఇటు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికకు సంబంధించి తెలంగాణకు పెద్ద ఎన్నిక అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని దెబ్బ తీయాలని కుట్ర పన్నారని ఆరోపించారు తమ్మినేని వీరభద్రం. బీజేపీ సాదాసీదా రాజకీయ పార్టీ కాదని.. ఒక పాపిస్ట్ పార్టీ అని ఆరోపించారు.

అది హిందూ పార్టీ కాదు… అది హిందువులలో అతి కొద్ది మంది పార్టీ అన్నారు. ప్రజలు అభివృద్ధి చెందాలని చూసే పార్టీ కాదన్నారు. ఎమ్మెల్యే లను కొనేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మెస్తున్నారని, సౌత్, నార్త్ ప్రాంతాలని అమ్మెస్తున్నారని మండిపడ్డారు. బిజెపి పాలనలో సామాజిక న్యాయం లేదు , రాష్ట్రాలకు హక్కులు లేవని మండిపడ్డారు. విద్యుత్ చట్టం తీసుకువచ్చి, రైతు నల్ల చట్టాలు చేసి రైతుల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము తీసుకున్న నిర్ణయం 100% సరైనదేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news