ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహిరి బుధవారం ఉదయం అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ముంబై వైద్యులు తెలిపారు. అయితే బప్పీ లహిరి చనిపోవడానికి గల కారణం ఓఎస్ఏ సమస్య. అయితే ఈ ఓఎస్ఏ సమస్య అంటే ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
ఓఎస్ఏ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా. లహిరి నెల రోజుల నుండి కూడా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక ఈ సమస్య గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనేది సాధారణంగా వచ్చే స్లీప్ డిసార్డర్.
ఈ సమస్య ఉంటే శ్వాస తరచుగా ఆగిపోవడం, సడన్ గా శ్వాస తీసుకోవడం వంటి సమస్య కలుగుతుంది. నిద్రపోయేటప్పుడు గొంతులో ఉండే మజిల్స్ శ్వాస తీసుకోవడం లో సమస్యని కలిగించి బ్లాక్ చేసేస్తాయి. గురక కూడా వచ్చేస్తుంది.
అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా యొక్క లక్షణాలు:
ఉదయం పూట బాగా నిద్ర కలగడం
పెద్దగా గురక కలగడం
నిద్రపోయేటప్పుడు శ్వాస ఆగిపోవడం
గాస్పింగ్ లేదా చొకింగ్ సమస్య
నోరు పొడిబారిపోవడం
గొంతు ఆరిపోవడం
ఉదయం పూట తలనొప్పి కలగడం
ఏకాగ్రత తగ్గిపోవటం
మూడ్ మారిపోవడం లేదా డిప్రెషన్ కలగడం
హై బీపీ
లిబిడో తగ్గిపోవడం
ట్రీట్మెంట్ :
స్లీప్ ఆప్నియా కి ట్రీట్మెంట్ ఉంది. నిద్ర పోయినప్పుడు ఎయిర్ బ్లాక్ అయిపోకుండా ఉండడానికి ట్రీట్మెంట్ చేస్తారు. మౌత్ పీస్ ని కూడా సజెస్ట్ చేస్తారు సర్జరీ ద్వారా కూడా తగ్గించవచ్చు.