నా సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరు :ప్రియాంక గాంధీ

-

లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంలోనే రాహుల్ గాంధీ హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు చేసారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు.రాహుల్ గాంధీకి ఆమె మద్దతుగా నిలిచారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరని, రాహుల్ కూడా ఇదే విషయాన్ని లోక్‌సభలో స్పష్టం చేశారని తెలిపారు.

కేవలం బీజేపీ, ఆ పార్టీ నాయకుల గురించే రాహుల్ మాట్లాడారని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని టార్గెట్ చేసుకొని సోమవారం నాడు విమర్శనాస్త్రాలు సంధించారు. శివుని ఫోటోను చూపిస్తూ, తమని తాము 24 గంటలపాటు హిందువులమని చెప్పుకునేవారిలో హింస, ద్వేషం, అసత్యం పేరుకుపోతోందని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు.. హిందూ మతం పేరు చెప్పి బీజేపీ అందరినీ భయపెడుతోందని, తమని తాము హిందువులని ప్రచారం చేసుకునేవారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అలాంటి వాళ్లు హిందువులే కారని అన్నారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version