నా భార్య నన్ను గోడకేసి బాదేది.. వర్మ..!

-

రాంగోపాల్ వర్మ ఒకప్పుడు శివ లాంటి మంచి మంచి సినిమాలు తెరకెక్కించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం అడల్ట్ సినిమాలు చేస్తూ అందరి చేత విమర్శలు పొందుతున్నాడు.. వర్మకి సినిమా సెన్స్ పూర్తిగా మారిపోయిందని.. కేవలం పబ్లిసిటీ పిచ్చి మాత్రమే పట్టుకుందని.. అందుకోసమే అడ్డమైన పనులు చేస్తున్నాడని.. చివరికి హీరోయిన్స్ కాళ్లు కూడా నాకుతున్నాడు అని ఇలా రకరకాలుగా అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.. ఎంతో క్రియేటివిటీ ఉన్న దర్శకుడు ఇలా మారిపోవడానికి కారణాలు ఏమైనా.. ప్రస్తుతం వర్మ లైన్ లోనే లేడు.. కానీ ఇంటర్వ్యూలు ఇస్తూ టైం గడిపేస్తున్నాడు.

ఇటీవల తన భార్య గురించి ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను గుర్తు చేసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారుతుంది.. వర్మ పిచ్చి పనులు భరించలేక అతడి భార్య రత్న అతని నుంచి విడాకులు తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఇకపోతే రత్నకు రాంగోపాల్ వర్మకు మధ్యలో ఎప్పుడు గొడవలు జరిగేవట. వర్మ చేసే పనులు నచ్చక అరచి గొడవ పెట్టుకునేదట. ఆమె ఎంత అరిచినా కూడా వర్మ నిశ్శబ్దంగానే ఉండేవాడట. ఒక్కోసారి ఇంటికి వచ్చినా.. ఆమె నుంచి తప్పించుకోవడానికి కనబడకుండా పారిపోయేవాడట.

ఒక్కొక్కసారి ఇంటికి కూడా కొన్ని రోజులపాటు వచ్చేవాడు కాదట. అలా వారిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఒకరోజు అయితే వర్మ ఇంటికి రాగానే రత్న ఏదో ఒక కారణంతో అతడిని నిలదీసిందట. కానీ ఎప్పటిలాగే సైలెంట్ గా ఉన్న వర్మను చూసి కోపం తట్టుకోలేక.. అదే కోపంలో అతడి చొక్కా కాలర్ పట్టుకుని గట్టిగా ప్రశ్నించింది.. వర్మ నిశ్శబ్దంగానే ఉండడంతో గోడకేసి బాధిందట.. ఇంత గొడవ జరుగుతుంటే వారి అరుపులు విన్న వర్మ తండ్రి అదే సమయానికి వారిని చూసి భర్తను కొడుతున్న రత్నను ఆయన మందలించాడట. ఇక తర్వాత విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని వర్మ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version