మైలవరం రచ్చ..జోగికి రివర్స్..వసంతకు సెట్?

-

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే..కొన్ని స్థానాల్లో నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి. కొన్ని చోట్ల అధికారం కోసం రచ్చ నడుస్తుంటే..మరి కొన్ని చోట్ల వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకోవడం కోసం రచ్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్థానంలో గత కొన్ని రోజులుగా వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్‌ల మధ్య రాజకీయ రగడ నడుస్తోంది.

మైలవరం సీటు విషయంలో ఈ పంచాయితీ నడుస్తోంది. ప్రస్తుతం మైలవరం ఎమ్మెల్యేగా వసంత ఉన్నారు..అటు పెడన నుంచి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో జోగికి పెడనలో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయనే ప్రచారం వస్తుంది. దీంతో జోగి మైలవరంపై ఫోకస్ పెట్టారని తెలిసింది. వాస్తవానికి జోగి సొంత స్థానం మైలవరం. 2014లో జోగి అక్కడ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం మైలవరంలో వసంత, పెడనలో జోగి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మైలవరంలో వసంతని సైడ్ చేసి ఆ సీటు దక్కించుకోవాలని  జోగి చూస్తున్నారు. ఆయన వర్గం మైలవరంలో సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తుంది.

 

అలాగే వసంతకు చెక్ పెట్టాలని చూస్తుంది. దీంతో రెండు వర్గాల మధ్య రచ్చ మొదలైంది. ఇదే క్రమంలో పరిశీలకుడు మర్రి రాజశేఖర్ రెండు వర్గాలకు సర్దిచెప్పడానికి చూశారు గాని..సెట్ అవ్వలేదు. రెండు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లారు. ఇదే క్రమంలో తాజాగా కేబినెట్ సమావేశం ముగిశాక జగన్..జోగిని పిలిచి మాట్లాడి..మైలవరంలో జోక్యం చేసుకోవడంపై క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది.

ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా అనవసర వివాదాలకు ఆస్కారం ఇవ్వొద్దని, ఇకపై అలాంటి చర్యలను సహించ బోనని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో మైలవరంలో ఇకపై జోగి ఎంట్రీ ఉండదనే ప్రచారం వస్తుంది. మరి ఇంతటితో మైలవరం పంచాయితీ సెట్ అయినట్లో కాదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news