ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ధనుష్ “నేనే వస్తున్నా”

-

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ధనుష్. తాజాగా తమిళ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ టాలెంటెడ్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నేనే వస్తున్నా’. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో ధనుష్ డ్యూయల్ రోల్ లో నటించాడు.

హీరోగా, విలన్ గా రెండు పాత్రలను ధనుష్ ఈ సినిమాలో పోషించడం విశేషం. సెల్వ రాఘవన్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను నిర్మించాడు. తమిళ్ లో నానే వరువీన్ గా వచ్చిన ఈ చిత్రం డీసెంట్ పెర్ఫామెన్స్ బాక్సఫీస్ దగ్గర అందుకుంది. ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ లో అలరించేందుకు సిద్ధం అయినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దిగ్గజ ఓటిటి సంస్థ ప్రైమ్ వీడియో వారు అన్ని భాషలలో కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం ఈ అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి అప్పుడు మిస్ అయి ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారు ఈసారి చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version