రా రా బంగార్రాజు : నాగ్ స‌పోర్ట్ జ‌గ‌న్ కే!

-

మొద‌ట్నంచి కొన్ని విష‌యాల్లో వ్యాపారం సంబంధ విష‌యాల్లో జ‌గన్ కు చెందిన నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ లాంటి వ్య‌క్తులు,హీరో నాగార్జున‌కు ఎంతో చేరువ.ఆ విధంగా నాగ్ మాట జ‌గ‌న్ వింటారు.జ‌గ‌న్ మీడియాకు సినిమా ప‌రిశ్ర‌మ త‌ర‌ఫున ముఖ్యంగా త‌న స్టూడియోస్ త‌ర‌ఫున కావాల్సినంత సాయం చేస్తారు నాగ్..ఈవిధంగా ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న, స్నేహం కార‌ణంగా మ‌రోసారి నాగార్జున త‌న ఆత్మీయ బంధాన్ని కొనసాగించారు.టికెట్ ధ‌ర‌ల‌పై వివాదాలున్నా కూడా ఆయ‌న వీటిపై మాట్లాడ‌లేదు.మొన్న‌టి వేళ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన‌ప్పుడు కానీ మ్యూజిక‌ల్ ఈవెంట్ లో కానీ ప్రీ రిలీజ్ వేడుక‌ల్లో కానీ ఎక్క‌డా ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

సినిమా వేదిక‌ల‌పై రాజ‌కీయాలు మాట్లాడ‌కూడ‌దు మాట్లాడ‌ను అని ఓ స్ప‌ష్ట‌మ‌యిన క్లారిటీ కూడా ఇచ్చేశారు.దీంతో నాగ్ – జ‌గన్ బంధం మ‌రోసారి బ‌ల‌ప‌డింది.అంతేకాదు మిగిలిన హీరోలు కూడా తమ‌,త‌మ వేడుక‌ల్లో మాట్లాడ‌కుండా ఉండేందుకు ఇదొక సూచ‌న‌లా మారింది.అందుకే చిరు కూడా నిన్న‌టి వేళ ఏపీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నందున ఎవ్వ‌రూ ఎక్క‌డా నోరు జారి మాట్లాడ‌వ‌ద్ద‌ని హిత‌వు చెప్పారు.ఎందుకంటే ఇవాళ ఉన్న ప‌రిస్థితుల రీత్యా ఇండ‌స్ట్రీని కాపాడుకునే ప‌నిని అంతా భుజాన వేసుకోవాల్సిందే! ఇందుకు ఏ ఒక్క‌రూ అతీతులు కారు.ఇలాంటి సంద‌ర్భాల్లో బాధ్య‌తాయుత‌మైన వ్య‌క్తులు బాధ్య‌తాయుతంగా మాట్లాడాలి.ఏం మాట్లాడినా అవ‌న్నీ కాంట్ర‌వ‌ర్సీలే! ఇండ‌స్ట్రీ కాస్త త‌గ్గి, వెనుక‌టిలా ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌తో ఉంటే స‌మ‌స్య‌లు వాటంత‌ట అవే ప‌రిష్కారం అవుతాయి.అంతేకాదు కొన్ని కుటుంబాల‌కు మ‌ళ్లీ ఉపాధికి ఢోకా ఉండ‌దు.

jagan

టికెట్ రేట్ల త‌గ్గింపుపై ఇప్ప‌టికే వివాదం రేగుతోంది.దీని తీవ్ర‌త‌ని త‌గ్గించేందుకు ఇండస్ట్రీ త‌ర‌ఫున చిరు త‌న వంతు ప్ర‌యత్నాలు చేస్తున్నారు.పెద్ద‌గా కాదు బిడ్డ‌గానే అంటూ నిన్న‌టి వేళ ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలో ఉన్న ఆయ‌న నివాసానికి వెళ్లి లంచ్ మీట్ లో పాల్గొని, అనేక విష‌యాలు చ‌ర్చించారు. త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ల‌కు సంబంధించి ఓ క్లారిటీ వ‌స్తుంద‌న్న ఆశాభావం ఒక‌టి వ్య‌క్తంచేశారు చిరంజీవి.ఇదే స‌మ‌యంలో నాగ్ కూడా స్పందించారు. వారం కింద‌టే త‌న‌కు చిరు ఫోన్ చేసి చెప్పార‌ని,సినిమా ప‌బ్లిసిటీ యాక్టివిటీస్ ఉండ‌డంతో వెళ్ల‌లేక‌పోయాన‌ని త‌న‌దైన వివ‌ర‌ణ ఇచ్చారు.దీనిపై కూడా విమ‌ర్శ‌లు రేగుతున్నాయి.నాగ్ త‌న‌ని తాను సేఫ్ జోన్ లో ఉంచుకుంటూ భ‌లే క‌వ‌ర్ చేసుకుంటున్నార‌ని కొంద‌రు ఔత్సాహికులు సెటైర్లు వేశారు కూడా!

ఇక టికెట్ల వివాదంపై నాగ్ స్పందిస్తూ..త‌న సినిమాపై ఏపీలో త‌గ్గించిన టికెట్ ధ‌ర‌ల ప్ర‌భావం అస్స‌లు ఉండ‌ద‌ని, తాను ఒక అంచ‌నాతోనే సినిమాను రూపొందించాన‌ని, టికెట్ ధ‌ర‌లు ఇంకాస్త బాగుంటే ఇంకాస్త ఎక్కువ డబ్బులు వ‌స్తాయ‌ని క్లారిటీ ఇచ్చేశారు నాగ్.దీంతో నాగ్ స‌పోర్ట్ జ‌గ‌న్ కే అని స్ప‌ష్టం అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version