యువ సామ్రాట్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా దూసుకుపోతున్నారు. ఇటీవల బాలీవుడ్లో గెస్ట్ రోల్ పోషించిన లాల్ సింగ్ చద్దా సినిమా కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఆయన వ్యక్తిగత విషయంలోకి వెళ్తే నాగచైతన్య ఒక పర్ఫెక్ట్ లవర్ బాయ్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్న ఈయన తన లవ్ గురించి వెల్లడించడం జరిగింది..
చైతన్య మాట్లాడుతూ.. తన లైఫ్ లోని చాలా పర్సనల్ విషయాలను ఈ సందర్భంగా బయటపెట్టాడు. ఇక ఒకసారి రైల్వే స్టేషన్లో తన ప్రియురాలిని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారని, నాగచైతన్య చెప్పిన విషయం ప్రస్తుతం సంచలనగా మారింది. అయితే కారు వెనుక సీటులో ఒకసారి చైతన్య తన గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెట్టుకుంటున్నాడట. అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి పట్టుకున్నారు అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. కానీ ఇది ఎప్పుడు జరిగింది..ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అనే విషయాన్ని మాత్రం ఆయన బయట పెట్టకపోవడం గమనార్హం.
ఇకపోతే నాగచైతన్య – సమంతను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఎవరితోనైనా సరే కొంచెం చనువుగా ఉంటే చాలు ఆ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక నాగచైతన్య రెండవ వివాహం చేసుకుంటాడా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి కొంతమంది ఏమో నాగచైతన్య – సమంత మళ్ళీ కలిసి పోవాలని కూడా ప్రార్థిస్తున్న సందర్భాలు మనం చాలానే చూస్తున్నం. మరి అదే సందర్భమే వస్తే నాగచైతన్య – సమంత జోడీ కలిస్తే మళ్లీ క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకుంటారనటంలో సందేహం లేదు.