మల్లెమాలలో వాళ్ల హంగామా వల్లే నేను బయటకి వచ్చాను .!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. అయితే చాలా కాలంగా జడ్జి గా వున్న నాగబాబు వెళ్ళిపోయారు.  రోజా కూడా ఇటీవల మంత్రి పదవి రావడంతో షో కు గుడ్ బై చెప్పింది.

అయితే నాగబాబు మాత్రం మల్లె మాల వాళ్ల తో గొడవ పడి వెళ్ళిపోయి నట్లుగా ప్రచారం జరిగింది. ఇక వారి చేతిలో అవమానాలు పడలేక నాగబాబు వెళ్లినట్లు చాలా మంది చెప్పారు. కాని అందులో  కొంత నిజం ఉందని ఒక ఇంటర్వ్యూ సందర్బంగా నాగబాబు మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.మల్లెమాల అధిపతి అయిన శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, తనకు ఎలాంటి గొడవలు లేవన్నారు. అలాగే ఈటీవీ వారితోనూ విభేదా లేవని పేర్కొన్నారు. కానీ అందులో ఉండే ఎంప్లాయిస్‌ కారణంగానే తాను బయటకు వచ్చినట్టు చెప్పారు. మేనేజర్‌ స్థాయి ఉద్యోగులు బాగా హంగామా చేసే వారని అది నాకు అస్సలు నచ్చేది కాదని చెప్పారు.

రేటింగ్స్ కోసం, అధిపతి ను ఇంప్రెస్ చేయటానికి  కాస్త అతి చేసేవారని, వాళ్లకి ఏం తెలియకపోయినా ఓవర్‌ చేసేవాళ్లని చెప్పారు. వారి ఆటిట్యూడ్‌ విషయంలోనే తాను ఇమడలేకపోయానని తెలిపారు. వారి వల్ల నాకు అక్కడ ఉండలేని పరిస్థితులు వచ్చాయని, వారి వల్ల నేను మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చిందని, అందుకే దూరమవ్వాలనుకుని బయటకు వచ్చానని, అంతేకాదు పెద్ద వారితో తనకు ఎలాంటి గొడవలు లేవని చెప్పారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version