జనసేనాని పవన్ కళ్యాణ్ప నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నిన్ను నమ్మని వాళ్ల కోసం ఎందుకు నిలబడతావని అడిగితే చెట్టుని చూపిస్తాడు.. అది నాటిన వాళ్లకే నీడనిస్తుందా అని. నీతో నడవని వాళ్ల కోసం ఎందుకు నిందలు మోస్తావని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు.. తనకి మొక్కని రైతు కంటిని తడపకుండా పంటనే తడుపుతుందని. అప్పట్నుంచి అడగటం మానేశా. అతని ఆలోచనా విశాలతని అర్థం చేసుకోవడం మొదలెట్టా’ అని పేర్కొన్నారు. సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శకపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది….సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది….విజయీభవ…….! అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.
కాగా, జనసేన పార్టీ 2014 లో స్థాపించిన పవన్ కళ్యాణ్,2014 ఎన్నికలప్పుడు నేరుగా పోటీలో దిగకుండా ఇతరపార్టీలకు మద్దతునిచ్చారు .2019 ఎన్నికలలో నేరుగా ఆంధ్రప్రదేశ్ లో పోటి చేసినా, కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలింది. ఈసారి మాత్రం బిజెపి, తెలుగుదేశం పార్టీతో పొత్తుకుదురుచుకుంది.