ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ వెంటే ఉంటా.. ఆయనే నా బలం : నామా నాగేశ్వరరావు

-

ఈడీ నోటీసులు జారీ చేసిన అనంతరం మొదటిసారిగా టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఎప్పడు జీవితంలో నీతి… నిజాయితీతో ఉంటున్నానని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. నా బలం కేసీఆర్… ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు నామా. 40 ఏళ్ళ క్రితమే మధుకన్ ను స్థాపించానని… రాత్రిపగలు కష్టపడ్డానన్నారు. మధుకన్ అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసిందని.. ఏ కంపెనీలలో నేను డైరెక్టర్ గా లేనన్నారు నామా.

రాంచీ ఎక్స్ ప్రెస్ వే ఎస్పివి కంపెనీ…BOT పద్ధతిలో ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. నేషనల్ హైవే సంస్థ ప్రాజెక్టు పూర్తి కోసం ముందుకు వచ్చిందని.. కానీ విచారణల కారణంగా వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. ఎస్క్రో అకౌంట్ పై బ్యాంకర్ కే పూర్తి పవర్ ఉందని.. విచారణకుకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. ట్రిబ్యునల్ లో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని.. నేను డైరెక్టర్ ను కాదు…అయిన నాకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో నిధులు మళ్లించడానికి అసలు అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version